: 'నువ్వు ఒంటరివి కాదు' అంటూ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న దీపికా పదుకొనే

బాలీవుడ్ అగ్ర తారల్లో ఒకరైన దీపికా పదుకునే సామాజిక సేవా కార్యక్రమాల్లో సైతం చురుకుగా పాల్గొంటోంది. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు ఆమె 'ది లైవ్ లివింగ్ లాఫ్ ఫౌండేషన్'ను స్థాపించింది. ఈ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఆరు రాష్ట్రాల్లోని 276 విద్యాలయాల్లో 6,480 మంది టీచర్ల ద్వారా 34వేల మంది విద్యార్థులకు ఆమె స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని అందించారు.

యూ ఆర్ నాట్ అలోన్ (నీవు ఒంటరివి కాదు) అనే పేరుతో ఆమె ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ సంస్థ ఇప్పుడు ఏడాది కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె బెంగళూరులోని మీడియా ప్రతినిధులతో సంభాషించింది. కౌమార దశలో ఉన్న విద్యార్థులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, మానసిక ఆందోళనను తొలగించుకోవడానికి తమ బోధనలు ఉపకరిస్తాయని చెప్పింది. ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, ఉత్తరాఖండ్ లలో విజయవంతంగా నిర్వహించామని తెలిపింది.

More Telugu News