: కుల్ భూషణ్ జాదవ్ కేసులో తీర్పుపై సుష్మాస్వరాజ్ కు మోదీ ఫోన్

భార‌తీయ నేవీ మాజీ అధికారి కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను గూఢ‌చారిగా చిత్రీక‌రిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండానే పాకిస్థాన్‌ ఉరిశిక్ష విధించిన‌ కేసులో అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల స్పందిస్తూ విదేశాంగ మంత్రి సుష్మాస్వ‌రాజ్‌కు ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ రోజు న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల మోదీ సంతృప్తి వ్య‌క్తం చేశారు. ఈ కేసును అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో దీటుగా వాదించిన హ‌రీశ్ సాల్వేని అభినందిస్తున్న‌ట్లు మోదీ పేర్కొన్నారు.

అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పు ప‌ట్ల సుష్మా స్వ‌రాజ్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానంలో ఇండియా త‌ర‌ఫున స‌మ‌ర్థవంతంగా వాదించిన హ‌రీశ్ సాల్వీని అభినందిస్తున్న‌ట్లు ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను భార‌త్‌కు రప్పించేందుకు ఉన్న ఏ అవ‌కాశాన్నీ తాము వ‌ద‌లబోమ‌ని ఆమె ఉద్ఘాటించారు. ఈ రోజు న్యాయ‌స్థానం ఇచ్చిన తీర్పుప‌ట్ల కుల్‌భూష‌ణ్‌జాద‌వ్ కుటుంబ స‌భ్యుల‌తో పాటు యావ‌త్ భార‌తీయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నార‌ని ఆమె పేర్కొన్నారు.





More Telugu News