: జాద‌వ్‌ను ఉరితీయ‌బోమ‌ని పాకిస్థాన్ హామీ ఇవ్వాలి: అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఆదేశం

పాకిస్థాన్‌ ఆర్మీ కోర్టు ఉరిశిక్ష విధించిన భార‌త నేవీ మాజీ అధికారి కేసులో ఈ రోజు అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం భార‌త్‌కు అనుకూలంగా మ‌ధ్యంత‌ర తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం పాకిస్థాన్ తీరును ఎండ‌గ‌ట్టింది. కుల్ భూష‌ణ్ జాద‌వ్‌ను పాకిస్థాన్ అరెస్టు చేసిన తీరు వివాదాస్ప‌దంగా ఉంద‌ని వ్యాఖ్యానించింది. తుది తీర్పు వెలువ‌డేవ‌ర‌కు కుల్‌భూష‌ణ్ జాద‌వ్‌ను ఉరితీయ‌కూడ‌దని ఆదేశించింది. కుల్‌భూష‌ణ్ జాద‌వ్ భార‌తీయుడ‌ని భార‌త్, పాక్ అంగీక‌రించాయ‌ని, ఈ రెండు దేశాలు వియ‌న్నా ఒప్పందంలో భాగ‌స్వాములుగా ఉన్న నేప‌థ్యంలో నిబంధ‌న‌ల ప్రకారం తాము త్వ‌ర‌లో తుది తీర్పును వెల్ల‌డిస్తామ‌ని తెలిపింది. తమ నుంచి తుది తీర్పు వచ్చేవరకు జాద‌వ్‌ను ఉరితీయ‌బోమ‌ని పాకిస్థాన్ హామీ ఇవ్వాలని అంత‌ర్జాతీయ న్యాయ‌స్థానం ఆదేశించింది. కుల్‌భూష‌ణ్ కేసులో భార‌త్‌కు అనుకూలంగా తీర్పురావ‌డ‌తో ముంబ‌యితో పాటు ప‌లు ప్రాంతాల్లో భార‌తీయులు ట‌పాసులు కాల్చి సంబ‌రాలు చేసుకుంటున్నారు.          

More Telugu News