: శ్రీలంకకు లక్షా 50 వేల కోట్ల రుణమివ్వనున్న చైనా

బీజింగ్ లో జరిగిన ‘బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఫోరం’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా శ్రీలంకకు సుమారు 1.5 లక్షల కోట్ల రూపాయల రుణమిచ్చేందుకు చైనా ఆసక్తి చూపుతోందని ఆ దేశ మంత్రి శరత్ అమనుగమా తెలిపారు. ‘వన్‌ బెల్ట్‌, వన్‌ రోడ్‌’ ప్రాజెక్టులో భాగమయ్యే దేశాలకు అదనంగా రుణాలు ఇచ్చేందుకు చైనా సిద్ధమైందని ఆయన చెప్పారు. చైనా నుంచి తమ దేశం 50 వేల కోట్ల రూపాయల రుణం పొందుతోందని, చైనా తాజా నిర్ణయంతో ఈ రుణం నాలుగు రెట్లు అదనంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు. దీంతో తమకు చైనా నుంచి లక్షా యాభై వేల కోట్ల రూపాయల రుణం లభించనుందని ఆయన వెల్లడించారు. అయితే ఈ రుణం చైనా ప్రభుత్వం ఇస్తుందా? లేక ఆసియా మౌలిక వసతుల పెట్టుబడి బ్యాంకు ఇస్తుందా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ సదస్సుకు భారత్ గైర్హాజరైన సంగతి తెలిసిందే. 

More Telugu News