: భారతీయులకు ఇళ్లు అద్దెకివ్వను... ఏం చేసుకుంటారో చేసుకోండి: బ్రిటిష్ సంపన్నుడు విల్సన్

భారత్, పాకిస్థాన్ జాతీయులకు తాను ఇళ్లను అద్దెకు ఇవ్వను గాక ఇవ్వనని తెగేసి చెబుతున్నాడు బ్రిటన్ సంపన్నడు ఫెర్గూస్ విల్సన్. తన నిర్ణయం వివాదాస్పదమైనా, కోర్టుకు వెళ్లినా సరే.. నిర్ణయాన్ని మార్చకునే ప్రసక్తే లేదంటున్నాడు. వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంటుందని, మళ్లీ కార్పెట్లు వేయడానికి బోల్డంత ఖర్చవుతోందని, అందుకే వారికి ఇళ్లు అద్దెకు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాని చెబుతున్నాడు.

ఇక్కడ సమస్య శరీరానికి సంబంధించినది కాదని, కూరకు సంబంధించినదని పేర్కొన్నాడు. ఫెర్గూస్‌కు వెయ్యికిపైగా ఇళ్లు ఉన్నాయి. భారత్, పాక్ జాతీయులకు ఇళ్లను అద్దెకు ఇవ్వవద్దంటూ విల్సన్ తన ఏజెంట్లకు పంపిన ఈ-మెయిల్స్ లీక్ కావడంతో ఈ దుమారం రేగింది. విల్సన్ నిర్ణయంపై బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఈహెచ్ఆర్‌సీ) సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును ఆశ్రయించింది. విల్సన్ నిర్ణయాన్ని నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరినట్టు సంస్థ  ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్ తెలిపారు.

More Telugu News