: వాతావరణ కాలుష్యం నుంచి గర్భిణులను కాపాడే ‘గాజులు’!

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం, కార్బన్ మోనాక్సైడ్ కు దూరంగా ఉండటం వంటి కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ప్రతి ఏటా చాలా మంది గర్భిణులు మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో గర్భిణులకు ఎంతో ఉపయోగపడే సాంకేతిక గాజులు.. కార్బన్ మోనాక్సైడ్ ఎక్స్ పోజర్ లిమిటర్ (కోయల్) అందుబాటులోకి వచ్చాయి. ఇంటెల్ కార్పొరేషన్, గ్రామీణ్ ట్రస్ట్ లు సంయుక్తంగా ఈ సాంకేతిక గాజులను తయారు చేశాయి. గ్రామీణ్ ఇంటెల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ (జీఐఎస్బీ) కంపెనీ బంగ్లాదేశ్ స్థానిక భాషను ఉపయోగించి ఈ గాజులను తయారు చేసింది.

ఈ గాజులను ప్రయోగాత్మకంగా పరిశీలించే నిమిత్తం ఇప్పటికే బంగ్లాదేశ్ తో పాటు భారత్ లో కూడా ఐదు వేల మంది గర్భిణులకు ఈ గాజులను జీఐఎస్బీ పంపిణీ చేసింది. వాటి పనితీరు బాగున్నట్లు ఫలితాలు రావడంతో, భారత్, బంగ్లాదేశ్ లలో ఈ గాజుల విక్రయాలు త్వరలో చేపట్టనున్నారు. పలు దేశాలకు వీటి విక్రయాలను విస్తరించే ఉద్దేశంలో కంపెనీ వర్గాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ గాజుల గురించి, వాటి పనితీరు గురించి చెప్పాలంటే..

* సాధారణ గాజుల్లానే ఉండే ఈ గాజుల తయారీకి అత్యాధునిక ప్లాస్టిక్ ను వినియోగించారు.
* పలు రంగుల్లో లభ్యమయ్యే ఒక్కో గాజు ధర సుమారు రూ.800
* వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ స్థాయిని గుర్తించేందుకు వీటిలో అత్యాధునిక సెన్సర్లు ఉంటాయి.
* మోతాదుకు మించి కార్బన్ మోనాక్సైడ్ ఉంటే ఈ గాజులు హెచ్చరికలు జారీ చేస్తాయి.
* వెంటనే ఎర్రరంగులోకి మారిపోతాయి, బీప్ శబ్దం చేస్తాయి. ఉన్న చోటు నుంచి బయటకు పొమ్మని స్థానిక భాషలో
   హెచ్చరిస్తాయి.
* రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పటి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ గాజులు సూచిస్తాయి.
* ఏ ఆహారం తీసుకోవాలి, డాక్టర్ వద్దకు ఎప్పుడు వెళ్లడం, ప్రసవం నిమిత్తం ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలనే విషయాలను  గాజులు సందేశాల ద్వారా గర్భిణులకు తెలుస్తాయి.

More Telugu News