: జన సేనాని పవన్‌ పోటీ చేసే నియోజక వర్గం కదిరా? గుంతకల్లా?

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుంచి తాను పోటీ చేస్తానని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఆ జిల్లాలో ఏ నియోజకవర్గం నుంచి పవన్ బరిలోకి దిగుతారనే విషయం ఆయన అభిమానుల్లో, రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, కదిరి నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆ పార్టీ నేత ఒకరు చెబుతున్నారు. అలాగే, గుంతకల్లు నియోజకవర్గంపైనా పవన్ దృష్టి ఉందని తెలుస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పవన్ అభిమానుల సంఖ్య విపరీతంగా ఉండటంతో, ఆయా నియోజకవర్గాలపైనే జన సేనాని దృష్టి పెట్టినట్టు సమాచారం. మరోపక్క, అనంతపురం నియోజకవర్గం నుంచి తాను బరిలోకి దిగితే ఎలా ఉంటుందనే విషయాన్నీ పవన్ తన సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

More Telugu News