: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు.. గుంటూరు, విజయవాడల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రత

తెలుగు రాష్ట్రాల్లో ఎండ‌లు మండిపోతున్నాయి. వ‌రుస‌గా రెండో రోజు సాధారణం కంటే నాలుగు నుంచి ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో త‌ప్పా మ‌ధ్యాహ్నం పూట బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని చెబుతున్నారు. రాత్రివేళ‌ల్లోనూ వ‌డ‌గాల్పుల తీవ్రత అధికంగానే ఉంద‌ని పేర్కొన్నారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు...
గుంటూరు, విజయవాడ- 47 డిగ్రీలు
ఒంగోలు, ఏలూరు, కాకినాడ- 45 డిగ్రీలు
నెల్లూరు- 44 డిగ్రీలు

తెలంగాణలో న‌మోదైన ఉష్ణోగ్ర‌త‌ల వివ‌రాలు..
ఆదిలాబాద్‌, ఖమ్మం, నల్లగొండ- 45 డిగ్రీలు
 నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌- 44 డిగ్రీలు
 హైదరాబాద్‌లో - 42 డిగ్రీలు

More Telugu News