: 30 కంప్యూటర్లకు 'వాన్నా క్రై'... ఇబ్బందేమీ లేదు: టీటీడీ ఈఓ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన 30 కంప్యూటర్లకు ర్యాన్సమ్ వేర్ 'వాన్నా క్రై' వైరస్ సోకిందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ఈ ఉదయం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన, సమస్యను పరిష్కరించామని తెలిపారు. కొంతమంది సిబ్బంది పైరేటెడ్ సాఫ్ట్ వేర్ ను తమ సిస్టమ్స్ లో ఇన్ స్టాల్ చేసుకోవడం వల్లే సమస్య తలెత్తినట్టు గుర్తించామని అన్నారు. సాధ్యమైనంత త్వరగా, విండోస్ ఎక్స్ పీ ఆపరేటింగ్ సిస్టమ్ ను అన్ని కంప్యూటర్ల నుంచి తీసివేసి, అధునాతన సాఫ్ట్ వేర్ తో అప్ డేట్ చేస్తామని తెలిపారు. భక్తులకు, ఆన్ లైన్ సేవల బుకింగ్ కు వైరస్ కారణంగా ఎటువంటి ఇబ్బందులూ తలెత్తలేదని తెలిపారు. వైరస్ సోకిన కంప్యూటర్లలో డేటా ఏమీ లేదని వెల్లడించారు. ఈ విషయమై టెక్ నిపుణులతో సంప్రదింపులు చేస్తున్నామని సింఘాల్ తెలిపారు.

More Telugu News