: బాడీ పెయిన్స్ కు ‘బీర్’తో చెక్ పెట్టొచ్చంటున్న పరిశోధకులు!

బీర్ లో బాడీ పెయిన్స్ ను తగ్గించే గుణాలు ఉన్నట్టు తాజా అధ్యయనంలో తేలింది. లండన్ లోని సుమారు నాలుగు వందల మందిపై నిర్వహించిన పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఈ విషయమై మొత్తం 18 అధ్యయనాలను నిర్వహించారు. ఈ అధ్యయనాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

బాడీ పెయిన్స్ తో బాధపడుతున్న కొందరు వ్యక్తులకు కొంత మొత్తంలో బీర్ తాగించగా, మరికొందరికి నొప్పిని తగ్గించే మందులను ఇచ్చారు. అనంతరం, వీరి బాడీ పెయిన్స్ ఏ మాత్రం తగ్గాయని పరీక్షించగా, బీర్ తాగిన వ్యక్తుల్లో నొప్పి తగ్గుముఖం పట్టింది. మందులు వేసుకున్న వారిలో ఎలాంటి మార్పును గమనించలేదు. అయితే, కేవలం, బీర్ తాగడం వల్లనే వారి బాడీ పెయిన్స్ తగ్గాయా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయమై పరిశోధకులు పరిశీలిస్తున్నారు.

More Telugu News