: రాముడికి, తలాక్ కు లింక్ పెట్టిన ముస్లిం పర్సనల్ లా బోర్డు

ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణ సందర్భంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు తన వాదనలు వినిపించింది. రాముడు అయోధ్యలోనే జన్మించాడని హిందువులు ఎలా అయితే నమ్ముతున్నారో... తలాక్ అనేది కూడా తమకు అలాంటి నమ్మకమే అని తెలిపింది. క్రీస్తు శకం 637 నుంచి ఉన్న విధానాన్ని ఇస్లాం వ్యతిరేకం అని ఎలా చెబుతామని అన్నారు. మహమ్మద్ ప్రవక్త తర్వాతి కాలంలో ట్రిపుల్ తలాక్ ఆచరణలోకి వచ్చినట్టు హదిత్ లో ఆధారాలు కూడా ఉన్నట్టు ముస్లిం బోర్డు తరపున వాదిస్తున్న కపిల్ సిబల్ తెలిపారు. ట్రిపుల్ తలాక్ మంచి ఆచారమని తాము కూడా చెప్పడం లేదని... ఇందులో మార్పు రావాల్సిన అవసరం ఉందని, అయితే ఇతరుల జోక్యం ఉండకూడదని మాత్రమే తాము కోరుతున్నామని తెలిపారు. 

More Telugu News