: మంత్రి కొడుకు నిషిత్ ఎందుకు బయటపడలేకపోయాడో తెలిసింది!

ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. నిషిత్ ప్రయాణిస్తున్న బెంజ్ జీ63 కారులో హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. అయినప్పటికీ అవేవీ నిషిత్ ను కాపాడలేకపోయాయి. దీనికి సంబంధించి జాతీయ మీడియాకు చెందిన ఓ వెబ్ సైట్ ఓ కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి ఎయూవీ కార్లలో 64 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో వెళితే ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిషిత్ ప్రయాణించిన కారు ఏకంగా 200 కిలోమీటర్ల వేగంతో పిల్లర్ ను ఢీకొట్టినట్టు చెబుతున్నారు. ఈ వేగంతో ప్రమాదానికి గురి కావడం వల్లే కారులోని సేఫ్టీ టూల్స్ నిషిత్ ను కాపాడలేకపోయాయని తెలిపింది. నిషిత్ ప్రయాణించిన కారు 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ వాహనం టాప్ స్పీడ్ 210 కిలోమీటర్లు.  

More Telugu News