: సెన్సెక్స్ ను సరికొత్త రికార్డుకు చేర్చిన రిలయన్స్, టీసీఎస్!

భారత స్టాక్ మార్కెట్ మరో సరికొత్త రికార్డును నమోదు చేసింది. దిగ్గజ సంస్థలు రిలయన్స్, టీసీఎస్ తో పాటు ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ వంటి కంపెనీల్లో వాటాల కొనుగోలుకు ఇన్వెస్టర్లు పోటీ పడటంతో ఈ ఉదయం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 197 పాయింట్లు పెరిగి ఆల్ టైం రికార్డు అయిన 30,519 పాయింట్లను తాకింది. నిఫ్టీ 47 పాయింట్లు పెరిగి 9,493 పాయింట్ల సరికొత్త స్థాయిని తాకింది. దేశ స్టాక్ మార్కెట్ చరిత్రలో కీలక సూచీలు ఈ అంకెలను తాకడం ఇదే తొలిసారి. హెవీ వెయిట్ కంపెనీల్లో పెరుగుదల సూచికలను ముందుకు నడిపించిందని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. కాగా, మార్కెట్ రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణ కనిపించడంతో సూచికలు కొంత కిందకు జారాయి. ఉదయం 11:10 గంటల సమయంలో బీఎస్ఈ 110 పాయింట్ల లాభంతో 30,423 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ 25 పాయింట్ల లాభంతో 9,471 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ-50 సూచికలో 28 కంపెనీలు లాభాల్లో ఉన్నాయి.

More Telugu News