: ముప్పేంటో తెలిసినా ఊరుకున్నారంటూ అమెరికాపై పుతిన్ మండిపాటు

తాజా సైబర్ దాడికి అమెరికా వైఖరే కారణమని, దీని గురించి ముప్పేంటో తెలిసినా చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు. అమెరికాయే ఈ వైరస్ ను తయారు చేసి దాచుకుందని ఆయన ఆరోపించారు. వారి నుంచే హ్యాకర్లు దీన్ని దొంగిలించారని పుతిన్ ఆరోపించారు. ఇక ఈ దాడిని ఓ మేల్కొలుపు చర్యగా తీసుకుని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా జాగ్రత్త పడాలని అన్ని దేశాల ప్రభుత్వాలనూ సాఫ్ట్ వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కోరింది. యూఎస్ నిఘా వర్గాలు విండోస్ లో కనిపెట్టిన చిన్న పొరపాటే దాడికి కారణమని, పాత ఆపరేటింగ్ వ్యవస్థలు కలిగిన అన్ని పర్సనల్ కంప్యూటర్లకూ ఈ ముప్పు ఉన్నట్టేనని అంది. దీనిపై తమకు హెచ్చరికలు అందినప్పుడే ఓ ప్యాచ్ ని విడుదల చేశామని, దాన్ని చాలా మంది అప్ డేట్ చేసుకోలేదని పేర్కొంది.

More Telugu News