: ఎన్నికలకు సిద్ధమవుతున్న జగన్.. అభ్యర్థుల విజయావకాశాలపై సర్వే

రానున్న ఎన్నికల కోసం వైసీపీ అధినేత జగన్ ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, వారి విజయావకాశాలపై సర్వే చేయిస్తున్నారు. అంతేకాదు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఇతర పార్టీల నుంచి వైసీపీలోకి రాబోయే నేతల గురించి కూడా సమాచారం తెప్పించుకుంటున్నారు. ఇప్పటికే ఈ సర్వేకు సంబంధించి కొంతమేర సమాచారం జగన్ కు అందిందని విశ్వసనీయ సమాచారం. నియోజకవర్గాల వారీగా పక్కా సమాచారాన్ని సేకరించే పనిలో జగన్ ఉన్నారు. త్వరలో జరగనున్న పార్టీ ప్లీనరీ సమావేశాల నాటికి ఈ సర్వే పూర్తి చేసి, సమావేశాల్లో దీనిపై చర్చించాలని జగన్ భావిస్తున్నారు.

సర్వే కోసం ప్రదానంగా మూడు అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారట. గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, నియోజకవర్గ సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న వారికి టికెట్ ఇస్తే.. వారు గెలుపొందే అవకాశాలు, ద్వితీయ స్థాయి నాయకులు పోటీ చేస్తే వారు గెలుపొందే అవకాశాలపై సర్వే చేయనున్నారు. దీనికి తోడు ఇతర పార్టీలకు చెందిన వారు ఎవరైనా వైసీపీలోకి చేరేందుకు మొగ్గు చూపుతున్నారా?... వారి రాకతో పార్టీకి ఎంతమేర లాభం ఉంటుంది? అనే విషయంపై కూడా సమాచారం సేకరించనున్నారు. 

More Telugu News