: వలస, మతం పేరుతో జీహాద్ ను విస్తరిస్తారు...వారిని దేశంలో అడుగుపెట్టనీయకండి: అమెరికా న్యూస్ ఎడిటర్

ముస్లిం సమాజంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదనకు డబ్ల్యూఎమ్‌డి న్యూస్ ఎడిటర్ లీ హోమాన్ నుంచి మద్దతు లభించింది. ముస్లిం దేశాల ప్రజలపై పలు ఆంక్షలు విధిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాలను ఆయన సమర్థించారు. అమెరికాలో ముస్లిం జనాభా పెరిగిపోతోందని ఆయన తెలిపారు. మెజారిటీ ముస్లిం దేశాల వారికి వీసాలు ఇవ్వడం ఆపేసి, ట్రంప్ మంచి నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ముస్లిం జనాభా పెరిగితే, అమెరికాలో ఎలాంటి పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందన్న విషయంపై ఆయన 'స్టెల్త్ ఇన్వెషన్ ముస్లిం కాన్‌ క్వేస్ట్ త్రో ఇమ్మిగ్రేషన్ అండ్ ది రిసెటిల్‌ మెంట్ జిహద్' పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు. అందులో ముస్లింలు యుద్ధ భయం వంకతో వివిధ దేశాల్లో తలదాచుకునే పేరుతో రావడం, ఆ తరువాత మత సంప్రదాయం పేరుతో పిల్లల్ని కనడం... ఆశ్రయమిచ్చిన దేశంలోనే మతస్వేచ్ఛ లేదన్న పేరుతో దాడులకు తెగబడడం జరుగుతుందని ఆరోపించారు.

 దీనికి స్వేఛ్ఛ, మంచితనం పేరుతో స్థానికులు కూడా సాయం చేస్తుండడం ఆందళనకరమని ఆయన పేర్కొన్నారు. అమెరికాలో మొత్తం 3,200 ల వరకు మసీదులుండగా, వాటిలో చాలా వాటికి సౌదీ అరేబియా ప్రభుత్వమే ధనసహయం చేస్తోందని ఆయన గుర్తుచేశారు. అలాగే విదేశాల నుంచి వచ్చే ఇమామ్ లకు అమెరికా ఆర్1 వీసాలు మంజూరు చేస్తుందని, వాటిని నిలిపేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా ఇమామ్ లు వీసా పేరుతో అమెరికాలోనే స్థిరపడి, జీహద్‌ను విస్తారించడానికి ప్రయత్నిస్తుంటారని ఆయన తెలిపారు. అలాంటి వారికి వీసాలు మంజూరు చేయడం ద్వారా దేశంలో అశాంతి తలెత్తుందని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇమామ్ లకు వీసాలు నిరాకరించాలని ఆయన సూచించారు. ఇమామ్ లు దేశంలో అడుగుపెడితే, అది అమెరికాకు ఆత్మహత్యా సదృశ్యమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

More Telugu News