: జపాన్ ను తాకిన ర్యాన్సమ్ వేర్... నిస్సాన్, హిటాచీ కంపెనీల్లో వైరస్

సాంకేతికతకు పెను ముప్పుగా పరిణమించిన ర్యాన్సమ్ వేర్ వైరస్ బారినపడిన దేశాల్లో జపాన్ కూడా చేరిపోయింది. ఇప్పటికే దాదాపు 150 దేశాలకు విస్తరించిన వైరస్, జపాన్ కు చెందిన అతిపెద్ద మోటార్ సంస్థ నిస్సాన్ తో పాటు, ఎలక్ట్రానిక్స్ ఉపకరణాల సంస్థ హిటాచీలను పట్టుకుంది. తమ కొన్ని యూనిట్లలోని వ్యవస్థలను 'వాన్నా క్రై' పట్టుకుందని నిస్సాన్ వెల్లడించింది. అయితే, తమ వ్యాపారంపై దీని ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిపింది. ఇక హిటాచీ సంస్థ తమ ఫైల్స్ తెరచుకోవడం లేదని, ఈ- మెయిల్ వ్యవస్థ నిలిచిపోయిందని, ఇది ర్యాన్సమ్ వేర్ వైరస్ అవునా? కాదా? అన్నది తెలియరాలేదని తెలిపింది. కాగా, జపాన్ లోని 600 ప్రాంతాల్లోని 2 వేలకు పైగా కంప్యూటర్లకు వైరస్ సోకినట్టు జపాన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కో-ఆర్డినేషన్ సెంటర్ వెల్లడించింది.

More Telugu News