: జస్టిస్ కర్ణన్ కు చుక్కెదురు.. క్షమాపణ చెబుతానన్న విన్నపాన్ని తిరస్కరించిన సుప్రీం!

కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనను అరెస్ట్ చేయాలంటూ జారీ చేసిన ఆదేశాలను వెనక్కి తీసుకోవాలంటూ కర్ణన్ చేసిన విన్నపాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తాను చేసిన దానికి బేషరతుగా క్షమాపణ చెబుతానని సుప్రీంకోర్టును ప్రాధేయపడినా... ఆ విన్నపాన్ని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ తిరస్కరించింది. అరెస్టు ఆదేశాలను వెనక్కి తీసుకోబోమని తేల్చి చెప్పింది. అంతేకాదు, కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. కర్ణన్ కు ఆరు నెలల జైలు శిక్షను సుప్రీంకోర్టు విధించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, వెంటనే ఆయనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. అయితే, కోర్టు తీర్పుకు కొన్ని గంటల ముందే కర్ణన్ అజ్ఞాతవాసంలోకి వెళ్లారు. 

More Telugu News