: వధువుకు ఘోర అవమానం... అనుమానంతో వివస్త్రను చేసిన వరుడి బంధువులు!

పెళ్లి పీటలకు ఎక్కాల్సిన నవ వధువుకు ఘోర అవమానం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మహోబా జిల్లాలో జైహింద్ అనే యువకుడికి, తీజా అనే యువతికి పెళ్లి కుదిరింది. బంధుమిత్ర సపరివారంతో పెళ్లి జరుగుతున్న ప్రాంగణమంతా కళకళలాడుతోంది. ఇంతలో పెళ్లి కొడుకు తనకీ పెళ్లి వద్దని చెప్పి అందరికీ షాకిచ్చాడు. పెళ్లి కూతురికి బొల్లి (ల్యూకోడెర్మా) వ్యాధి ఉందని, అందుకే తనకీ పెళ్లి వద్దని చెప్పాడు. అలాంటి వ్యాధి తనకు లేదని, తాను సంపూర్ణ ఆరోగ్యవంతురాలినని వధువు చెప్పినా వినిపించుకోలేదు.

ఆమె తల్లిదండ్రులు బతిమిలాడినా పట్టించుకోలేదు. పెళ్లి కూతురు కుటుంబం అంటే గిట్టని వ్యక్తి పెళ్లికొడుకు చెవిలో ఈ అబద్ధాన్ని ఊదాడు. దీంతో పెళ్లి ఆపాలని వరుడు డిమాండ్ చేయడంతో వధువు తండ్రి పోలీసులను తీసుకొచ్చాడు. దీంతో పోలీసులు వారితో చర్చించి, వధువును వరుడి బంధువులైన మహిళలతో ఒక గదిలోకి పంపి వివస్త్రను చేసి తనిఖీ చేయించారు, దీంతో ఆమెకు ఎలాంటి ల్యూకోడెర్మా లేదని నిర్ధారించారు. అనంతరం వరుడు, వధువు కుటుంబానికి క్షమాపణలు చెప్పడంతో వివాహం సాఫీగా సాగిపోయింది. 

More Telugu News