: అమెరికాను కొట్టే 'పర్ఫెక్ట్ వెపన్ సిస్టమ్' సిద్ధమైందని కిమ్ జాంగ్ సంబరాలు

అమెరికాను దెబ్బకొట్టేలా 'పర్ఫెక్ట్ వెపన్ సిస్టమ్' సిద్ధమైందని చెబుతూ ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ సంబరాల్లో మునిగిపోయారు. మధ్యస్థ రకానికి చెందిన ఖండాంతర క్షిపణి ప్రయోగం విజయవంతమైందని ప్రకటన వెలువడిన తరువాత పొంగ్ యాంగ్ లో భారీ ఎత్తున సంబరాలు జరిగాయి. మరింత పెద్ద అణు బాంబును మోసుకు వెళ్లి అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా తాకేలా బాలిస్టిక్ మిసైల్ ను రూపొందించనున్నట్టు ఈ సందర్భంగా కిమ్ పేర్కొన్నారు.

కాగా, నిన్న ఇంటర్మీడియెట్‌ రేంజ్‌ క్షిపణిని నార్త్ కొరియా పరీక్షించగా, అది ఆకాశంలో 2 వేల కిలోమీటర్ల ఎత్తులో 500 మైళ్లు ప్రయాణించి రష్యా సమీపంలోని జపాన్‌ సముద్రజలాల్లో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రయోగాన్ని అమెరికా కూడా ఖండించింది. దీని విజయం నుంచి లభించిన ప్రోత్సాహంతో మరింత పెద్ద క్షిపణికి కిమ్ జాంగ్ ప్రయత్నించవచ్చని ఆందోళన వ్యక్తం చేసింది.

More Telugu News