: మన దేశంలో పొడవైన వంతెనను ప్రారంభించనున్న ప్రధాని

మన దేశంలో ముంబయిలోని బాంద్రా-వ్రోలి మధ్య ఉన్న3.55 కిలోమీటర్ల వంతెనకు పొడవైన వంతెనగా పేరుంది. ఈ రికార్డును త్వరలో అసోం-అరుణాచల ప్రదేశ్ మధ్య నిర్మించిన వంతెన అధిగమించనుంది. బ్రహ్మపుత్ర నదిపై ధోలా నుంచి సదియా మధ్య 9.15 కిలో మీటర్ల దూరాన్ని ఇది కలుపుతుంది. ఈ వంతెనను ఈ నెల 26వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అసోంలో ప్రారంభించనున్నారు.

మరో విషయమేమిటంటే, మూడేళ్ల ఎన్డీఏ పాలన ఉత్సవాలను కూడా మోదీ అదే రోజు అక్కడ ప్రారంభిస్తారు. కాగా, 2011లో రూ. 950 కోట్ల వ్యయంతో ఈ వంతెనను నిర్మించారు. దీని నిర్మాణం 2015 కు పూర్తి కావాల్సి ఉండగా కొన్నికారణాల వల్ల ఆలస్యమైంది. కొత్తగా నిర్మించిన ఈ వంతెన చైనా సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉండగా, అసోం రాజధాని డిస్పూర్ కు 540 కిలోమీటర్ల దూరంలో, అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు మూడు వందల కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం.

More Telugu News