: విశాఖ హవాలా కేసు సీఐడికీ అప్పగింత!

విశాఖపట్టణం కేంద్రంగా బోగస్ కంపెనీల పేర్లతో సుమారు రూ.1,500 కోట్లను హవాలా రూపంలో తరలించిన కేసును సీఐడీకి అప్పగిస్తున్నట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. విశాఖలో ఈ రోజు ఆయన మాట్లాడుతూ, ఈ కేసులో నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ కుంభకోణంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతామని అన్నారు. వేల కోట్ల రూపాయలను హవాలా రూపంలో విదేశాలకు తరలించారని, విచారణ తర్వాత మొత్తం వివరాలు వెల్లడవుతాయని అన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వడ్డి మహేష్ కు ఏపీకి చెందిన ఓ మంత్రి అండ ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

More Telugu News