: ఇప్పటికైనా రష్యా నోరు తెరుస్తుందని అనుకుంటా: డొనాల్డ్ ట్రంప్

ఉత్తర కొరియా నేడు జరిపిన క్షిపణి పరీక్షలో భాగంగా ప్రయోగించిన మిసైల్ రష్యాకు కేవలం 60 మైళ్ల దూరంలో పడటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇప్పటికి కూడా నార్త్ కొరియా క్షిపణి ప్రయోగాలపై రష్యా నోరు మెదపకుండా ఉంటుందని తాను భావించడం లేదని అన్నారు. ఈ క్షిపణి ఇంకాస్త దూరం ప్రయాణిస్తే ఏం జరిగివుంటుందో ఊహించుకోవాలని అన్నారు. ఇక ఈ ప్రయోగంలో భాగంగా కిమ్ జాంగ్ సైన్యం ఓ కొత్త రకం ఖండాంతర క్షిపణిని ప్రయోగించిందని జపాన్ రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. దక్షిణ కొరియాకి నూతన అధ్యక్షుడుగా మూన్ ఎన్నికైన వారం రోజుల వ్యవధిలోనే ఈ ప్రయోగాన్ని ఉత్తర కొరియా చేపట్టడం వెనుక, మూన్ ను ఒత్తిడిలోకి నెట్టే వ్యూహం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

More Telugu News