: రేపు మరో భారీ సైబర్ దాడి: హెచ్చరించిన యూకే నిపుణులు

ప్రపంచవ్యాప్తంగా 'వాన్నా క్రై' మాల్‌ వేర్‌ సృష్టించిన కలకలం ఇంకా కొలిక్కి రాకముందే, సోమవారం నాడు మరో భారీ సైబర్ దాడి జరగనుందని హెచ్చరిస్తున్నారు సైబర్ నిపుణులు. ఇక ఈ రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కోవడం 'వాన్నా క్రై'ని ఎదుర్కొన్నంత సులువుగా ఉండబోదని యూకేకు చెందిన సైబర్‌ నిపుణులు డారెన్‌ హుస్‌ తెలిపారు. పాత వైరస్ ల కోడింగ్ లో మార్పులు చేసిన హ్యాకర్లు, ప్రపంచ సైబర్ సిస్టమ్ ను సర్వనాశనం చేసేందుకు కదులుతున్నారని అన్నారు.

కాగా, దాదాపు 100 దేశాలను వణికించిన 'వాన్నా క్రై' నుంచి ఇప్పుడిప్పుడే పలు సంస్థలు కోలుకుంటున్నాయి. యూకేలో 48 కంపెనీల కంప్యూటర్లు హ్యాక్ నకు గురికాగా, ఆరు కంపెనీలు తిరిగి సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇదిలావుండగా, తమ అధీనంలోకి వచ్చిన డేటాను వెనక్కు ఇచ్చేందుకు ఒక్కో కంప్యూటర్ నుంచి 300 డాలర్లు వసూలు చేస్తున్న 'వాన్నా క్రై' సృష్టికర్తలు, ఇప్పటికే 22 వేల డాలర్ల ఆదాయాన్ని పొందినట్టు తెలుస్తోంది. దీన్ని బిట్ కాయిన్ల రూపంలో మాత్రమే చెల్లించాలని వారు షరతులు పెడుతున్న సంగతి విదితమే.

More Telugu News