: సైబర్ దాడులపై మూడు రోజుల ముందే హెచ్చరించిన బ్రిటన్ తెలుగు వైద్యుడు

బ్రిటన్ ప్రభుత్వ ఎన్ హెచ్ఎస్ (నేషనల్ హెల్త్ సర్వీస్) వెబ్ అనుసంధాన నెట్ వర్క్ చాలా బలహీనంగా ఉందని, సులువుగా హ్యాకర్లు సైబర్ దాడులను చేయవచ్చని అక్కడి తెలుగు వైద్యుడు డాక్టర్ చింతపల్లి కృష్ణ మూడు రోజుల క్రితమే హెచ్చరించారు. నేషనల్ హాస్పిటల్ లో న్యూరాలజీ విభాగంలో సేవలందిస్తున్న ఆయన బ్రిటిష్ మెడికల్ జర్నల్ కు ఓ వ్యాసం రాస్తూ, మాల్ వేర్ ను ప్రయోగించి దాడి చేసే అవకాశాలను ప్రస్తావించారు. ఇప్పటికీ 2001లో విడుదలైన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ను ఇక్కడ వాడుతున్నారని ఆయన గుర్తు చేశారు. హ్యాకింగ్ జరిగితే పెద్ద సంఖ్యలో హాస్పిటల్స్ మూతవేయక తప్పదని కృష్ణ హెచ్చరించారు. ఇది ప్రచురితమైన మూడో రోజున బ్రిటన్ ఆరోగ్య వ్యవస్థపై అతిపెద్ద సైబర్ దాడిని జరిపి 'వాన్నా క్రై' వైరస్ ను చొప్పించారు హ్యాకర్లు. కాగా, ఈ వైరస్ ప్రభావంతో అనుమతులు లభించక, ఎన్నో ఆపరేషన్స్ ఆగిపోయిన పరిస్థితి ఏర్పడింది.

More Telugu News