: భారత్ చెప్పినా వినకుండా చైనాకు జై కొడుతున్న నేపాల్!

ఇండియా తీవ్ర అభ్యంతరం చెబుతున్న 'ఓబీఓఆర్' (వన్ బెల్ట్ వన్ రోడ్) ప్రాజెక్టుకు నేపాల్ జై కొట్టింది. చైనా ఆధ్వర్యంలో ప్రాజెక్టుపై నేటి నుంచి రెండు రోజుల పాటు బీజింగ్ లో సదస్సు జరగనున్న నేపథ్యంలో, ఆర్థిక దిగ్గజమైన చైనాను నిర్లక్ష్యం చేయలేమని, తమ దేశానికి పెట్టుబడులు చాలా అవసరమని, చైనా తమకు పొరుగుదేశం కూడా కాబట్టి దాన్ని దూరం చేసుకునే ప్రసక్తే లేదని నేపాల్ స్పష్టం చేసింది.

ఈ విషయంలో భారత ఆందోళన తమకు తెలుసునని వ్యాఖ్యానించిన నేపాల్ రాయబారి దీప్ కుమార్ ఉమాధ్యాయ, చైనాతో ఉన్న విభేదాలపై భారత్ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు కృషి చేయాలని సలహా ఇచ్చారు. తాము రెండు దేశాల మధ్యా తటస్థంగా ఉంటామని తెలిపారు. కాగా, ఓబీఓఆర్ సదస్సుకు 65 దేశాలు హాజరవుతున్నాయి. ఇండియా మాత్రం దీనిలో పాల్గొనబోవడం లేదు. దేశ సమగ్రత, సార్వభౌమాధికారంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత్, తాము ప్రాజెక్టుకు మద్దతివ్వలేమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News