: అదనపు కట్నం తీసుకురాలేదని భార్యకు ఫోన్‌లో తలాక్ మెసేజ్ పంపించాడు!

ఓవైపు ట్రిపుల్ తలాక్‌పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంటే, మరోవైపు తలాక్‌లు నిశ్శబ్దంగా జరిగిపోతున్నాయి. ఉత్తరప్రదేశ్‌ దాద్రిలోని గౌతంపురిలో ఓ భర్త అత్తంటివారు కట్నం ఇవ్వలేదన్న కారణంతో ఫోన్‌లో మూడుసార్లు తలాక్ చెప్పేశాడు. మీరట్‌కు చెందిన సల్మా (22)కు గురుగ్రామ్‌లోని సూరత్ నగర్‌కు చెందిన ఆజాద్ (25)తో ఏప్రిల్, 2016లో వివాహమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 19న ఆజాద్ ట్రిపుల్ తలాక్ అంటూ సల్మా తండ్రికి ఫోన్ ద్వారా టెక్ట్స్ మెసేజ్ పంపించాడు.

‘‘మై ఆప్ భేటీ సల్మా తో తలాక్, తలాక్, తలాక్ దేతా హు, ఉస్ కే సాత్ రెహ్‌నా హరామ్ హై’’ అని అందులో పేర్కొన్నాడు. అతడి మెసేజ్ చదివి తాను షాక్‌కు గురయ్యానని సల్మా పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగం పేరుతో తమను నమ్మించి పెళ్లి చేసుకున్నాడని, పెళ్లి సందర్భంగా తన కుటుంబ సభ్యులు రూ.15 లక్షలు ఖర్చు చేసినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అతడికి ప్రభుత్వ ఉద్యోగం లేదని తెలిసి ప్రశ్నించినప్పటి నుంచి తనను వేధిస్తున్నాడని, అదనంగా మరో రూ.5 లక్షలు తీసుకురమ్మని బెదిరిస్తున్నాడని పేర్కొంది. ఆ డబ్బును  ప్రభుత్వ ఉద్యోగం కోసం లంచంగా ఇస్తానని చెప్పాడని తెలిపింది. ఆ డబ్బులు ఇవ్వనందుకే తనకు తలాక్ చెప్పాడని ఆరోపించింది. కేసు నమోదు చేసుకు్న దాద్రి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News