: స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ సమస్యలకు చెక్... ఐదు నిమిషాల్లోనే ఫుల్ చార్జ్!

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క‌రు త‌మ వ‌ద్ద ఓ స్మార్ట్‌ఫోన్ ఉండాల‌నే కోరుకుంటారు. కొన్ని గంట‌ల‌కే స్మార్ట్‌ఫోన్‌లోని ఛార్జింగ్ అయిపోవ‌డంతో కాస్త ఇబ్బంది ప‌డుతుంటారు. గంట సేపు ఛార్జింగ్ పెట్టుకున్నా బ్యాట‌రీ ఫుల్ గా నిండ‌దు. అటువంటి ఇబ్బందుల‌ను తొలగించ‌డానికే కేవలం ఐదు నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అయ్యే బ్యాటరీలను తీసుకొస్తున్నారు. ఫ్లాష్‌బ్యాటరీ టెక్నాలజీతో రానున్న ఈ బ్యాటరీల ఉత్పత్తి వచ్చే ఏడాది నుంచి ప్రారంభమవుతుందని వాటిని అభివృద్ధి చేస్తోన్న ఇజ్రాయల్‌కు చెందిన స్టోర్‌డాట్ కంపెనీ సీఈవో డోరొన్ మయెర్స్ డోర్ఫ్ ఓ ఇంటర్వ్యూలో వెల్ల‌డించారు. ఈ త‌ర‌హా ఛార్జింగ్ మార్కెట్లో కొత్త‌గా ఏమీ రావ‌ట్లేదు. కాక‌పోతే, టెక్నాలజీ ప్రకారం ఫుల్ చార్జింగ్‌కు సుమారు గంట సమయం పడుతోంది. ప‌లు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు ఈ టెక్నాల‌జీని అందిస్తున్నాయి. అయితే, ఆ గంట స‌మయం కూడా అవ‌స‌రం లేకుండా కేవ‌లం ఐదు నిమిషాల్లోనే బ్యాట‌రీ ఫుల్ చేయ‌డానికి తాము కృషి చేస్తున్నామ‌ని  స్టోర్‌డాట్ కంపెనీ సీఈవో పేర్కొన్నారు.

More Telugu News