: నేను కూడా ఒక తల్లిని కావడంతో... బాగా కనెక్ట్ అయ్యాను: మంచు లక్ష్మి

మంచు లక్ష్మి నటించిన 'ది డెసిషన్' షార్ట్ ఫిలిం విమర్శకుల మన్ననలను సైతం అందుకుంటోంది. 21 నిమిషాల నిడివి గల ఈ షార్ట్ ఫిలిం ప్రీమియర్ ను నిన్న సాయంత్రం హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్స్ లో వేశారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్స్ లో ఈ షార్ట్ ఫిలింను ప్రదర్శించారు. కథ విషయానికి వస్తే... ఓ మహిళకు అప్పటికే ఒకసారి అబార్షన్ అయి ఉంటుంది. మరోసారి ఆమె గర్భం దాలుస్తుంది. డౌన్ సిండ్రోమ్ సమస్యతో బిడ్డ పుట్టవచ్చని డాక్టర్లు చెప్పడంతో ఆమె ఎంతో మానసిక ఆందోళనకు గురవుతుంది. ఈ అంశం చుట్టూనే ఈ షార్ట్ ఫిలిం తిరుగుతుంది. ఈ షార్ట్ ఫిలింకు సొంతంగా కథను తయారుచేసుకుని, దర్శకత్వం వహించాడు శ్రీను పాండ్రంకి. సంగీతాన్ని అనూప్ రూబెన్స్ అందించాడు.

ఈ సందర్భంగా మంచు లక్షి మాట్లాడుతూ, ఇలాంటి పాత్రను చేయడం నిజంగా ఛాలెంజింగ్ అని చెప్పింది. తాను కూడా ఒక తల్లిని కావడంతో... ఈ పాత్రకు చాలా కనెక్ట్ అయ్యానని తెలిపింది. ప్రతి తల్లి, తండ్రి చూడాల్సిన ఫిలిం ఇది అని చెప్పింది. 

More Telugu News