: రానున్న నాలుగైదు రోజులు జ‌ర‌భ‌ద్రం.. ఎండ‌లు మండిపోతాయ్‌: ఇస్రో

ఇటీవ‌ల ఏపీలో ఎండ‌ల వేడి కాస్త త‌గ్గి వ‌ర్షాలు కూడా ప‌డిన విష‌యం తెలిసిందే. అయితే, రేప‌టి నుంచి రాష్ట్రంలో వేడి పెరిగిపోతుంద‌ని, ప్ర‌జ‌లు జాగ్ర‌త్తలు పాటించాల‌ని ఇస్రో హెచ్చ‌రించింది. రేప‌టి నుంచి ఈ నెల 18 వరకు ఉష్ణోగ్రతల్లో భారీ మార్పులు సంభ‌విస్తాయ‌ని పేర్కొన్న‌ట్లు ఏపీ విపత్తు నివారణ సంస్థ తెలిపింది. వాయవ్య గాలుల ప్రభావంతో వాతావరణంలో జ‌ర‌గ‌నున్న మార్పుల కార‌ణంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలో పగటి ఉష్ణోగ్రతలు అధిక‌మ‌వుతాయ‌ని తెలిపింది. కర్నూలు, క‌డ‌ప‌, చిత్తూరు, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంటుంద‌ని పేర్కొంది.

More Telugu News