: 1500 కోట్ల కుంభకోణంలో నిందితుల అరెస్టు... విచారణ ప్రారంభం!

విశాఖపట్టణంలో బట్టబయలైన 1500 కోట్ల రూపాయల కుంభకోణంలో వడ్డి మహేష్, వడ్డి శ్రీనివాసరావు, ఆచంట హరీష్, ఆచంట రాజేష్, ప్రశాంత్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ రాయ్, ప్రవీణ్ కుమార్ ఝా, ఆయేష్ గోయెల్, దిలీప్ గొయెంకా, వికార్ గుప్తాలు ప్రధాన సూత్రధారులు. వీరిపై ఐదు సెక్షన్లపై కేసులు నమోదు చేసి, అదుపులోకి తీసుకున్నారు. కోల్ కతాలో ఉల్లిపాయల ఏజెంట్ గా పని చేసిన శ్రీనివాసరావు, ఆయన కుమారుడు మహేష్ ఈ కుంభకోణానికి పాల్పడడం విశేషం. దీని వెనుక బడా రాజకీయనాయకుడు ఒకరు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మహేష్, శ్రీనివాసరావు, హరీష్, రాజేష్ లను వైజాగ్ లోని ఎంవీపీ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్నారు. అంతే కాకుండా, వారికి సంబంధించిన 30 బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. కోల్ కతాలోని నిందితులను అరెస్టు చేసేందుకు పోలీస్ టీమ్స్ బయల్దేరాయి. 

More Telugu News