: నిషిత్ కారు ప్రమాదం నేపథ్యంలో బెంజ్ యాజమాన్యానికి లేఖ రాసిన పోలీసులు

కారు ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ మృతి చెందిన నేపథ్యంలో హైదాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు మెర్సిడస్ బెంజ్ యాజమాన్యానికి లేఖ రాశారు. అందులో ఆరు ప్రశ్నలు సంధించి వాటిని నివృత్తి చేయాల్సిందిగా సూచించారు. బుధవారం తెల్లవారుజామున బెంజ్‌కారులో వెళ్తూ నిషిత్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో నిషిత్, ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర ప్రాణాలు కోల్పోయారు.

నిషిత్ ప్రమాదానికి గురైన కారు బెంజ్ ఇంపోర్టెడ్ జి-63 మోడల్ కారు కావడంతో పలు సందేహాలతో కూడిన లేఖను పుణెలోని మెర్సిడస్ బెంజ్ ఇండియా ప్రధాన కార్యాలయానికి పోలీసులు రాశారు. ప్రమాదం జరిగితే కారులోని ఎయిర్ బెలూన్లు ఎప్పుడు తెరుచుకుంటాయి? నిషిత్ ప్రమాద సమయంలో అవి ఎందుకు పగిలిపోయాయి? వంటి సందేహాలను లేఖలో వ్యక్తపరిచారు. కారులో ఏవైనా సాంకేతిక కారణాలు ఉన్నాయా? స్పీడో మీటర్‌ను ఎంత వరకు లాక్ చేయాలి? తదితర సందేహాలను నివృత్తి చేయాల్సిందిగా అందులో కోరారు.

More Telugu News