: హైదరాబాద్‌లో ఇస్రో కేంద్రం.. అక్టోబరులోనే ప్రారంభం!

హైదరాబాద్‌లోని జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో ఇస్రో కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ఆ సంస్థ చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. వచ్చే అక్టోబరులోనే దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లోని సీఎస్ఐఆర్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్పేస్ మిషన్ల ద్వారా సేకరించిన డేటాను, పరిశోధనల ఫలితాలను ప్రజలకు అందుబాటులో ఉంచుతామన్నారు.

పరిశోధనలు చేయాలనుకునే వారికి ఈ కేంద్రం ఉపయోగపడుతుందని అన్నారు. చమురు ఇంధనాల వాడకాన్ని తగ్గించేందుకు వాహనాలకు, ఇతర అవసరాలకు లిథియం అయాన్ బ్యాటరీలను వాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. 10-12 ఏళ్లు పనిచేసే ఈ బ్యాటరీలకు సంబంధించిన సాంకేతికతను వాణిజ్య అవసరాల కోసం అందుబాటులోకి తెస్తామన్నారు. చరిత్రలో మైలురాయిగా నిలిచే నాలుగు టన్నుల బరువును రోదసీలోకి మోసుకెళ్లగలిగే జీఎస్ఎల్‌వీ మార్క్-3 డీ1 రాకెట్‌ను జూన్ 5న ప్రయోగించనున్నట్టు కిరణ్‌కుమార్ తెలిపారు.

More Telugu News