: ద్రోణాచార్యులు చాలామంది ఉన్నారు... అర్జునులు ముందుకు రావాలి: రాజ‌మౌళి పిలుపు

విశాఖపట్నం యాదవ జగ్గరాజుపేట గ్రీన్‌సిటీలో ఏర్పాటు చేసిన లక్ష్యా బ్యాడ్మింటన్‌ అకాడమీ ఈ రోజు సినీ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి చేతుల మీదుగా ప్రారంభ‌మైంది. ఈ సంద‌ర్భంగా అకాడమీలో శిక్ష‌ణ‌కు రెడీ అయిన‌ చిన్నారులతో రాజమౌళి కొంతసేపు బ్యాడ్మింటన్‌ ఆడారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. చిన్నారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. మ‌హా భార‌తంలో చెట్టుపై ఉన్న ప‌క్షిని చూపించి ఏం కనిపిస్తోందని ద్రోణాచార్యులు అడిగితే, పక్షి కన్ను మాత్రమే తనకు కనిపిస్తోందని అర్జునుడు చెప్పాడ‌ని రాజ‌మౌళి చెప్పారు. అలా చూసిన నాడే లక్ష్యాన్ని ఛేదించడం సాధ్యం అవుతుందని విద్యార్థుల్లో ప‌ట్టుద‌ల‌ను నింపే మాట‌లు చెప్పారు. అలాంటి అర్జునులు ప్రస్తుతం దేశానికి అవసరమ‌ని, కష్టం ఎదుగుదలకు బాటలు వేస్తుందని చెప్పారు. భార‌త్‌లో ద్రోణాచార్యులు చాలామంది ఉన్నారని, అర్జునులు మాత్రం ముందుకు రావాలని రాజ‌మౌళి అన్నారు.

More Telugu News