: 'బాహుబ‌లి 2'ను చూసి హాలీవుడ్‌ను మించిపోతామ‌ని అన‌డం బాగోలేదు: క‌మ‌లహాస‌న్‌

అందరి అంచ‌నాల‌ను మించి బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతున్న ‘బాహుబ‌లి-2’ సినిమాను చూడ‌డానికి ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. ఆ తరువాత ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా కమల హాసన్  ఈ సినిమా గురించి మాట్లాడుతూ ప్ర‌శంస‌ల‌తో పాటు ఓ విమ‌ర్శ‌ కూడా చేశారు. ఆర్థికంగా ఆలోచిస్తే ఇలాంటి సినిమాలు సినీ ప‌రిశ్ర‌మ‌కు అవ‌స‌రమ‌ని అన్నారు. ‘బాహుబ‌లి-2’ కోసం ఆ సినిమా యూనిట్ చాలా క‌ష్ట‌ప‌డింద‌ని పేర్కొన్నారు. అయితే, బాహుబ‌లిలోని కంప్యూట‌ర్ గ్రాఫిక్స్ గురించి మాత్రం భిన్నంగా స్పందించారు. ఈ సినిమాను మనం ఉదాహ‌ర‌ణ‌గా తీసుకొని హాలీవుడ్‌ను మించిపోతామ‌ని అన‌డమే బాగో లేదని, దానికి తాను అంగీక‌రించ‌బోన‌ని చెప్పారు. సినిమాలు తీయ‌డానికి మాత్రం మంచి క‌థ‌లు ఉన్నాయ‌ని, గొప్ప సంస్కృతి మ‌న‌కు ఉంద‌ని బాహుబ‌లి చిత్రం నిరూపించిందని ఆయ‌న తెలిపారు.

More Telugu News