: శ్రీలంకలో తమిళులను కలుసుకున్న ప్రధాని మోదీ

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ నివసిస్తున్న తమిళులను కలుసుకున్నారు. డికోయా ప్రాంతంలోని నూర్వుడ్ మైదానంలో ఈ రోజు వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. తేయాకు ఎగుమతుల్లో శ్రీలంక మూడో స్థానంలో ఉండటానికి కారణం అక్కడి తమిళ కార్మికులు చేసిన కృషేనని కొనియాడారు. ‘చాయ్’తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని ఈ సందర్భంగా ప్రస్తావించారు.

శ్రీలంకలో నివసిస్తున్న తమిళుల సంరక్షణ కోసం భారత ప్రభుత్వం అన్ని విధాలా వారికి అండగా ఉంటుందన్నారు. శ్రీలంకలోని తమిళ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అక్కడి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను భారత్ తప్పకుండా సమర్థిస్తుందన్నారు. అంతకుముందు, డికోయా ప్రాంతంలో భారత్ సాయంతో రూ.150 కోట్ల వ్యయంతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని మోదీ ప్రారంభించారు. కాగా, శ్రీలంకలో రెండు రోజుల పర్యటనలో భాగంగా తొలుత కొలంబోలో జరిగిన బౌద్ధుల అంతర్జాతీయ వెసక్ పర్వదిన వేడుకల్లో మోదీ పాల్గొన్నారు.

More Telugu News