: కరణ్ జొహార్ పెట్టింది 90 కోట్లు.. ఇప్పటికి లాభాలు 285.37 కోట్లు... కనక వర్షం కురిపిస్తున్న 'బాహుబలి-2'

'బాహుబలి-2: ద కన్ క్లూజన్' ప్రభంజనానికి భారతీయ సినిమా రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. 1200 కోట్ల క్లబుల్లో చేరిన ఏకైక సినిమాగా రికార్డు నెలకొల్పిన 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' హిందీలో స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ కు కోట్ల వర్షం కురిపించింది. నిన్నటి బాక్సాఫీసు లెక్కల ప్రకారం హిందీ బాహుబలి 375.37 కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా హిందీ హక్కులను దర్శక, నిర్మాత కరణ్ జోహర్ 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. సినిమా ప్రమోషన్ (పబ్లిసిటీ) కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

ఈ లెక్కన ఈ సినిమాకు కరణ్ జోహర్ మొత్తం 90 కోట్ల రూపాయలు వెచ్చించారు. దీంతో ఆయనకు 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా ఇప్పటికే 285.37 కోట్ల రూపాయలు లాభం తెచ్చిపెట్టింది. మరో పన్నెండు కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తే ఈ సినిమా అమీర్ ఖాన్ 'దంగల్' సాధించిన 387.38 కోట్ల రూపాయల రికార్డును తుడిచిపెట్టేస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమానా? మజాకా? అని వారు పేర్కొంటున్నారు.

More Telugu News