: భారత్ నుంచి ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు సరఫరా అవుతున్న 488 కోట్ల రూపాయల మత్తు మాత్రలు పట్టివేత

భారత్ నుంచి ఐఎస్ఐఎస్ తీవ్రవాదులకు సరఫరా అవుతున్న 488 కోట్ల రూపాయల విలువైన మత్తు మాత్రలను ఇటలీ పోలీసులు పట్టుకున్న ఘటన పెను కలకలం రేపుతోంది. దాని వివరాల్లోకి వెళ్తే... భారత్‌ నుంచి లిబియాలోని మిస్రాటా, తోబ్రుక్‌ ఓడ రేవులకు వెళ్తున్న ఓ నౌకలోని మూడు కంటెయినర్లలో దుప్పట్లు, షాంపూల పేరుతో సరఫరా అవుతున్న 3.70 కోట్ల ట్రామాడల్‌ మాత్రలను ఇటలీ పోలీసులు కనుగొన్నారు.

జెనీవాలోని ఓడరేవులోని లంగరు వేసిన ఓడ నుంచి ఈ మూడు కంటైనర్లను ఇటలీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 75 మిలియన్‌ డాలర్లు (488 కోట్ల రూపాయలు) ఉంటుందని వారు వెల్లడించారు. నల్లమందు లక్షణాలు కలిగి ఉండే ఈ మాత్రలను నొప్పుల నివారణ (పెయిన్‌ కిల్లర్‌) కు ఉపయోగిస్తారని వారు తెలిపారు. వీటిని లిబియాలోని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్ఐఎస్) తీవ్రవాదుల కోసం భారత్‌ నుంచి తీసుకొని వెళ్తున్నారని ఇటలీ దర్యాప్తు అధికారులు తెలిపారు. దీంతో ఈ మూడు కంటైనర్లని జెనీవా నౌకాశ్రయ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని టైమ్స్‌ పత్రిక వెల్లడించింది. 

More Telugu News