: నిషిత్ తెలివైన కుర్రాడు.. 8వ తరగతిలోనే ‘అమెజాన్ ఫ్యాక్ట్స్’ అనే పుస్తకం రాశాడు!

హైదరాబాద్‌లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ చిన్నప్పటి నుంచి చురుకైన, తెలివైన కుర్రాడు. ఇటీవలే తండ్రి ప్రారంభించిన నారాయణ విద్యాసంస్థల నిర్వహణలో అడుగుపెట్టిన ఆయన పూర్తిస్థాయి సారథిగా మారేలోపే మృతి చెందాడు. నారాయణ రాజకీయాల్లోకి వచ్చాక విద్యా సంస్థల చైర్మన్ పదవిని వదులుకుని కుమారుడు, ఇద్దరు కుమార్తెలను వాటికి డైరెక్టర్లుగా నియమించారు.  నిషిత్ ఇంజినీరింగ్, వైద్య కాలేజీలతోపాటు మొత్తం విద్యాసంస్థల బాధ్యతలను చూసుకుంటున్నాడు.

సింగపూర్‌లో బీబీఏ పూర్తి చేసిన నిషిత్ 8వ తరగతిలో ఉండగానే జంతుజాలం, మనుషుల మనస్తత్వాలపై ‘అమెజాన్ ఫ్యాక్ట్స్’ అనే పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని విక్రయించగా వచ్చిన సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించారు. రాజకీయాల్లో తండ్రికి చేదోడువాదోడుగా నిలుస్తున్నారు. త్వరలోనే నారాయణ విద్యాసంస్థల చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించనున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోడం కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది.

More Telugu News