: ఈ రెండు కారణాలే ఐపీఎల్ లో ఆర్సీబీని అట్టడుగున నిలిపాయి: పాంటింగ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ సీజన్-10లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. జట్టులో సూపర్ స్టార్లు ఉన్నప్పటికీ ఆ జట్టు నాకౌట్ కు చేరలేకపోయింది. వరుస ఓటములతో నీరుగారింది. ఈ నేపథ్యంలో 2015-16 సీజన్‌ లో ఆర్సీబీ జట్టుకు ఇన్‌ ఛార్జ్‌ గా వ్యవహరించిన ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్ ఆ జట్టు వైఫల్యం గురించి వివరించాడు.

ఐపీఎల్ తాజా సీజన్ లో కేఎల్ రాహుల్ జట్టులో ఆడకపోవడం తీవ్ర ప్రభావం చూపిందని పాంటింగ్ పేర్కొన్నాడు. గాయం కారణంగా రాహుల్ దూరం కావడంతో బెంగళూరు జట్టుకు ఓపెనింగ్ జోడీ సమస్యగా మారిందని అన్నాడు. టోర్నీ ఆద్యంతమూ ఓపెనర్లు పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాడు. గత సీజన్ లో రాహుల్, కోహ్లీల ఓపెనింగ్ జోడి అద్భుతంగా రాణించిందని గుర్తుచేశాడు. మరో కారణం ఏంటంటే... కోహ్లీ, గేల్, డివిలియర్స్, వాట్సన్ వంటి క్రికెట్ సూపర్ స్టార్లు ఈ సీజన్ లో దారుణంగా విఫలమయ్యారని తెలిపాడు. వీరి ఫాం కారణంగా జట్టు పరాజయం పాలైందని పాంటింగ్ తెలిపాడు. దీంతో ప్రస్తుతం ఆర్సీబీ అట్టడుగున నిలిచిందని అన్నాడు.

More Telugu News