: పూణె మహిళా టెక్కీ ‘హత్యా’చారం కేసులో దోషులకు మరణశిక్ష!

సుమారు పదిహేడేళ్ల క్రితం 2009 అక్టోబరులో పూణెలో మహిళా టెక్కీ నయనా ఫాతక్ పూజారి అత్యాచారానికి, ఆపై హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు దోషులకు మరణశిక్ష విధిస్తూ ఫాస్ట్ర్ ట్రాక్ కోర్టు ఈ రోజు తీర్పు నిచ్చింది. ముగ్గురు దోషులు యోగేష్ అశోక్ రౌత్, మహేష్ బాలా సాహెబ్ ఠాకూర్, విశ్వాస్ హిందూరావు కాదంలకు మరణశిక్ష విధించాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ హర్షద్ నింబాల్కర్ తన వాదనను గట్టిగా వినిపించారు.

ఆమెపై అత్యాచారం జరిపి, ఆపై అత్యంత క్రూరంగా హతమార్చారని కోర్టు ఎదుట తమ వాదన వినిపించారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన మరో నిందితుడు రాజేష్ పాండురంగాచౌదరి అప్రూవర్ గా మారిపోవడంతో అతనికి శిక్ష విధించలేదు. ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడటంపై నయనా భర్త అభిజిత్ పూజారి, వారి కుటుంబసభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.  

More Telugu News