: మాల్యాపై కోర్టు ధిక్కరణ నేరం... సుప్రీంకోర్టు సమన్లు

ఇండియాలో బ్యాంకులకు దాదాపు రూ. 9 వేల కోట్లకు పైగా బకాయి పడి, వాటిని చెల్లించకుండా విదేశాలకు చెక్కేసి, ప్రస్తుతం లండన్ లో తలదాచుకున్న యూబీ గ్రూప్ మాజీ చైర్మన్ విజయ్ మాల్యాపై కోర్టు ధిక్కరణ నేరం కింద సమన్లు జారీ అయ్యాయి. కోర్టుకు హాజరు కావాలని ఆదేశించినా, ఆయన ఇండియాకు రాకపోవడంతో, జూలై 10న హాజరు కావాలని ఆదేశిస్తూ, సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. ఆలోగా మాల్యా రాకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. కాగా, లండన్ లో ఇటీవల అరెస్ట్ అయి, ఆపై గంటల వ్యవధిలోనే బెయిల్ పై బయటకు వచ్చిన మాల్యాను ఎలాగైనా ఇండియాకు తీసుకురావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్, సీబీఐ విభాగాలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News