: అమెరికాలో చంద్రబాబు మరో విజయం.. అమరావతికి రానున్న ‘సిస్కో’!

అమెరికాలో పెట్టుబడుల అన్వేషణ సాగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు బృందానికి మరో విజయం దక్కింది. నెట్‌వర్కింగ్‌ సిస్టమ్స్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా పేరున్న సిస్కో అమరావతికి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. రాజకీయ నాయకులు, ఇతర దేశాల ప్రతినిధులను కలిసేందుకు ఇష్టపడని సిస్కో చీఫ్ జాన్ చాంబర్స్ స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు బృందాన్ని ఆయన నివాసానికి ఆహ్వానించారు. అంతేకాక ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో 30 కంపెనీల సీఈవోలు పాల్గొనేలా చూడడం ఏపీకి ఆయనిచ్చిన ప్రాధాన్యానికి నిదర్శనమని చెబుతున్నారు. అమరావతిలో ఆ సంస్థ అడుగుపెట్టేందుకు దాదాపు సిద్ధంగా ఉందని చంద్రబాబు బృందంలోని సభ్యులు తెలిపారు.

సమావేశం సందర్భంగా సిస్కో అధిపతి జాన్ చాంబర్స్ మాట్లాడుతూ ఈ చర్చలు ఆంధ్రప్రదేశ్, భారత్ పట్ల తమకున్న నిబద్ధతకు అద్దం పడతాయని పేర్కొన్నారు. వ్యక్తిగతంతా చంద్రబాబు పట్ల తనకున్న గౌరవానికి సూచిక అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సిస్కో కార్యకలాపాలకు అమరావతిని కేంద్రంగా చేసుకోవాలని కోరారు. చాంబర్స్ స్పందిస్తూ అమరావతిలో సిస్కో కార్యకలాపాలు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.  
 

More Telugu News