: భల్లాలదేవుడి రథం తయారైన విధంబెట్టిదనిన..!

దూసుకెళ్లే దున్నపోతులు, అడ్డొచ్చిన వారిని తునాతునకలు చేసేలా తిరుగుతూ ఉండే కత్తులు, ఒక్క మీట నొక్కితే వరుసగా విడుదలయ్యే ఈటెలు... ఇది 'బాహుబలి-2' చిత్రంలో భల్లాలదేవుడి రథం... పైకి ఇలా కనిపించే ఈ రథం తయారీ వెనుక ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఈ రథాన్ని ఎలా తయారు చేశారన్న విషయాన్ని ప్రొడక్షన్ డిజైనర్ సాబూ సిరిల్ స్వయంగా వెల్లడించారు. ఈ వాహనానికి ఓ రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ ఇంజన్ ను వాడామని, దీన్ని సులువుగా పరుగులు పెట్టించడానికి కారు స్టీరింగ్ ను అమర్చామని ఆయన తెలిపారు. పైకి భల్లాలదేవుడు కనిపించే రథాన్ని లోపల కూర్చున్న మరో డ్రైవర్ నడుపుతూ ఉంటాడని వెల్లడించారు. ఏదైనా సాంకేతిక సమస్య ఏర్పడితే సులువుగా పరిష్కరించ వచ్చనే ఆలోచనతోనే రాయల్ ఎన్ ఫీల్డ్ ఇంజన్ ను వాడినట్టు తెలిపారు. అయితే, ఏ మోడల్ వాహనం ఇంజన్ ను ఉపయోగించారన్న విషయాన్ని మాత్రం ఆయన తెలియజేయలేదు.

More Telugu News