: ‘నీట్’ రాయాలంటే బ్రా తొలగించమన్నారు.. అధికారులపై మండిపడిన విద్యార్థిని!

ఆదివారం దేశవ్యాప్తంగా నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్)కు హాజరైన విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు అధికారుల ‘డ్రెస్‌కోడ్’తో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేరళలోని కన్నూరులో పరీక్షా కేంద్రానికి వెళ్లిన ఓ విద్యార్థిని బ్రా ధరించడంతో పరీక్ష రాసేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు. దానిని తొలగించి వస్తేనే పరీక్ష రాసేందుకు అనుమతిస్తామని చెప్పడంతో ఆమె ఒక్కసారిగా షాక్‌కు గురైంది. చేసేది లేక దానిని తొలగించి బయట ఉన్న తల్లి చేతిలో పెట్టి పరీక్షకు హాజరైంది.

పరీక్ష హాలు నుంచి బయటకు వచ్చిన కుమార్తె, తన చేతిలో టాప్ ఇన్నర్ వేర్ పెట్టి మళ్లీ వేగంగా లోపలికి వెళ్లిపోయిందని విద్యార్థిని తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. పరీక్ష పూర్తయిన అనంతరం విద్యార్థిని ఈ విషయాన్ని మీడియాకు తెలియజేసింది. ‘నీట్’లో డ్రెస్‌కోడ్ విధించడంతో దేశవ్యాప్తంగా పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

More Telugu News