: ఆ ఆడియో టేపులు ఓ కుట్ర: ఆర్జేడీ

జైల్లో ఉన్న మహమ్మద్ షాబుద్దీన్ తో రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారన్నట్టుగా బహిర్గతమైన ఆడియో టేపులు సంచలనం సృష్టించగా, ఆ పార్టీ నేత మనోజ్ ఝా స్పందించారు. బీహార్ లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రతో బీజేపీ పన్నిన ప్రణాళికలో భాగంగానే టేపులు తయారయ్యాయని ఆయన ఆరోపించారు. ఈ ఆడియో టేపులు నకిలీవని, బీజేపీ అధినాయకులు దీని వెనుక ఉన్నారని, ఆడియో టేపులపై విచారణ జరిపించాలని తాము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. మరోవైపు జనతాదళ్ (యు) నేత కేసీ త్యాగి సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. జనతాదళ్, ఆర్జేడీల మధ్య విభేదాలు సృష్టించేందుకే ఈ టేపులను తయారు చేశారని తెలిపారు. కాగా, ఓ ఆంగ్ల న్యూస్ చానల్ లాలూ, జైల్లో ఉన్న ఆర్జేడీ నేత షాబుద్దీన్ మధ్య జరిగిన సంభాషణగా చెబుతూ ఈ ఆడియో టేపులను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News