: పాక్ నుంచి స్వేచ్ఛ కావాలని నినదించిన పీఓకే విద్యార్థులు

తమ ప్రాంతంలో పాకిస్థాన్ సైన్యం చేస్తున్న దాష్టీకాలకు వ్యతిరేకంగా పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) విద్యార్థులు రోడ్డెక్కారు. పాక్ సర్కారు, సైన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, తమకు స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలు కావాలని ప్రదర్శనకు దిగారు. పీవోకేలోని హజారియా కాలేజీ విద్యార్థులు ఈ ఆందోళన చేపట్టి, సైన్యం ప్రజలపై ఆగడాలకు దిగుతోందని వారు ఆరోపించారు.

కాగా, పాక్ సైన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళన వెనుక ప్రధాని నవాజ్‌ షరీఫ్ ఉన్నాడని, ఆయనే సైన్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఓ కేసు నమోదైంది. ఇష్తియాక్‌ అహ్మద్‌ మిర్జా అనే న్యాయవాది ఫిర్యాదుతో ఈ కేసును నమోదు చేశారు. పాక్‌ సైన్యానికి వ్యతిరేకంగా షరీఫ్‌ మాట్లాడుతున్న ఓ వీడియోను ఆయన సాక్ష్యంగా చూపుతూ, చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం గమనార్హం.

More Telugu News