: చాంపియన్స్ ట్రోఫీపై అటో ఇటో తేల్చేందుకు బీసీసీఐ సమావేశం

ఐసీసీ ప్రతిపాదించిన రెవెన్యూ షేరింగ్ మోడల్ ను తీవ్రంగా వ్యతిరేకించి, త్వరలో ప్రారంభమయ్యే చాంపియన్స్ ట్రోఫీని బహిష్కరిస్తామని హెచ్చరించిన బీసీసీఐ, సుప్రీంకోర్టు చీవాట్లతో ఓ మెట్టు దిగివచ్చి, నేడు ప్రత్యేకంగా సర్వసభ్య సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ టోర్నీని బహిష్కరిస్తేనే ఐసీసీ దారిలోకి వస్తుందని ఓ వర్గం వాదిస్తున్న నేపథ్యంలో ఈ సమావేశాలు వాడివేడిగా సాగుతాయని భావిస్తున్నారు.

బోర్డు మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ వర్గం ట్రోఫీని బహిష్కరించాలని వాదిస్తుండగా, పాలకుల కమిటీ చైర్మన్ వినోద్ రాయ్ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఐసీసీతో చర్చలు సాగుతున్న వేళ, పరిస్థితిని సంక్లిష్టం చేసే నిర్ణయాలు వద్దని ఆయన అంటున్నారు. ఇక టోర్నీలో పాల్గొనే విషయమై తక్షణం స్పష్టత ఇచ్చి, జట్టును ప్రకటించాలని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న బీసీసీఐ సర్వసభ్య సమావేశం కీలకలం కానుంది.

More Telugu News