: ఇష్టపూర్వకంగా చేస్తే వ్యభిచారం నేరం కాదు: గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

ఓ మహిళ తనంతట తానుగా వ్యభిచారం చేస్తే క్రిమినల్ కేసులు పెట్టరాదని గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఈ సంవత్సరం జనవరి 3వ తేదీన సూరత్ లోని ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేయగా, వినోద్ పటేల్ అనే వ్యక్తితో పాటు మరికొందరు పట్టుబడ్డారు. వీరిపై పోలీసులు ఐపీసీలోని సెక్షన్ 370, ఇమ్మోరల్ ట్రాఫిక్ (ప్రివెన్షన్) చట్టం కింద కేసు నమోదు చేయగా, వినోద్ దాన్ని హైకోర్టులో సవాల్ చేశాడు.

పోలీసులు వచ్చే సమయానికి తాను ఆ యువతితో లేనని, తన వంతు కోసం ఎదురుచూస్తున్నానని, ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం తనకు వర్తించదని వాదించాడు. కేసును విచారించిన న్యాయమూర్తి జేబీ పర్దీవాలా, ఆ అభియోగాలను కొట్టివేస్తూ, యువతి ఇష్టపడి సెక్స్ వర్కర్ గా మారిన పరిస్థితిలో, ఆమె వద్దకు వెళ్లే కస్టమర్లపై ఇమ్మోరల్ ట్రాఫిక్ చట్టం వర్తించదని తేల్చి చెప్పారు. అయితే, అరెస్ట్ చేసిన సమయానికి అతను డబ్బు చెల్లించి వుంటే వినియోగదారుడి కిందకు వస్తాడని, అప్పుడు సెక్షన్ 370 కింద విచారించవచ్చని తెలిపారు.

More Telugu News