: మొగల్తూరు ఆక్వా పార్క్‌లో ఐదుగురి మృతి ఘ‌ట‌న: ఫోరెన్సిక్‌ నివేదికలో నిజాలు వెల్లడి

ఈ ఏడాది మార్చి 30న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆనంద ఆక్వా పార్క్‌లో ఐదుగురు మృతి చెందిన ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా అల‌జ‌డి రేపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై అసెంబ్లీ కూడా అట్టుడికింది. ఆ ఘ‌ట‌న విష‌వాయువుల వ‌ల్ల జ‌ర‌గ‌లేద‌ని విద్యుదాఘాతం వల్ల జరిగిందని ఆనంద గ్రూపు సంస్థ పేర్కొంది.

అయితే, ఈ ఘటనకు సంబంధించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక జిల్లా పోలీస్‌ శాఖకు చేరింది. ఆ రోజు ఆ ఐదుగురు హైడ్రోజన్‌ సల్ఫైడ్‌ లాంటి విషవాయువు కారణంగానే ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆ నివేదిక ద్వారా వెల్ల‌డైంది. మరోవైపు ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకు విచారణ చేపట్టలేదు. ఫోరెన్సిక్‌ నివేదికలో కూడా నిజం తెలిసింద‌ని, ఆ ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని అరెస్ట్‌ చేయాలని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి.

More Telugu News